Monsoon And Electricity: భారీ వర్షాలు కరెంట్‌తో జాగ్రత్త, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు ముప్పే, ఇంట్లో కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో నదలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో చెరువులకు గండిపడటంతో రోడ్లన్ని తగి ప్రజారవాణ స్తంభించింది.
Hyd, July 21: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో నదలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో చెరువులకు గండిపడటంతో రోడ్లన్ని తగి ప్రజారవాణ స్తంభించింది.ఇక వర్షాకాలం కావడంతో పలు రకాల బ్యాక్టీరియా, వైరస్ లు, ఫ్లూ వైరస్‌ల విజృంభణ అధికంగా ఉంటుంది. అలాగే వర్షాలకు విద్యుత్ షాక్ తగిలి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు కొల్పోక తప్పదు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదని అలాగే విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదని సూచించారు. పార్కులలో గాని గ్రౌండ్ లో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదని, స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదని సూచించారు. అలాగే కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోవద్దని, బట్టలు ఇనుప తీగలపై వేయకూడదని తెలిపారు. గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదని అలాగే ఎట్టి పరిస్థితుల్లో కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదని తెలిపారు.
విద్యుత్ సరఫరా వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెం లకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదని చెబుతున్నారు.
అలాగే ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. నాణ్యమైన కరెంట్ వైర్లు వాడాలని లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కొంతమంది చేపల వేటకు విద్యుత్ తీగలను అమర్చి చేపలను పట్టడం వలన షాక్ గురై చనిపోతున్నారని చెబుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు/సపోర్టు వైరును, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకవద్దని సూచిస్తున్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను ఎట్టిపరిస్థితుల్లో తాకవద్దని, ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే , షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని షాకింగ్ పోస్ట్, తన దరఖాస్తులు ఉన్నాయా?,చెత్తబుట్టలోకి వెళ్లాయా అని ప్రశ్న?